ఆటకు కాదేది అనర్హం అన్నట్లు ఉంది! ఇప్పటికే ఎన్నో రకాల ఆటలు చూశాం. కానీ సాధారణంగా మన ఇండ్లల్లో సరదాగా ఆడుకునేది ఇలా ప్రొఫెషనల్‌గా మారుతుందని ఎవరూ అనుకోని ఉండరు. ఫ్లోరిడాలో తొలిసారి పిల్లో(మెత్త) ఫైటింగ్ చాంపియన్‌షిప్(పీఎఫ్సీ) జరిగింది. ఇందులో 16 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు తలపడ్డారు.