కరోనాతో విద్యార్థి మృతి.. ప్రిన్సిపల్ ఏమన్నారు?

న్యూఢిల్లీ: “గుడ్డి నేతలకు ప్రజల బాధలు, చావులూ ఏవీ పట్టవు. మనం క్రూరమైన, మొండిబారిన జాతిగా తయారవుతున్నాం”. కోవిడ్‌తో విద్యార్థి మృతి చెందడంపై ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలివి. రాజస్థాన్‌కు చెందిన సత్యం ఝా (18) ఏప్రిల్ చివరి వారంలో స్వస్థలం కోటా వెళ్లాడు. తర్వాత అక్కడే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నాడు. బాధితులకు సాయపడడంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఇంతలో కరోనా సోకింది. 8 రోజులపాటు వెంటిలేటర్‌పై గడిపి గురువారం సాయంత్రం కన్నుమూశాడు. అతనితోపాటే అతని తల్లిదండ్రుల కలలు అంతమైపోయాయి అని ప్రిన్సిపాల్ జాన్ వర్ఘీసే కాలేజీ వెబ్సైటులో ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు పెట్టారు. ప్రియమైన వ్యక్తుల మరణం ముందు నేతల అధికారాలు, అందలాలు ఏం చేసుకోవడానికి? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులోకి ఆశావహంగా చూస్తున్న ఓ యువకుడు ఇక లేడు అని ఆయన తన మెసేజ్‌లో పేర్కొన్నారు. కాలేజీలోని గాంధీ-అంబేడ్కర్ విద్యార్థి సంఘం కూడా సత్యం మృతి పట్ల సంతాపం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

