గవర్నమెంట్ జాబ్ చేయాలనేది అందరి కల. కానీ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సమయం సరిపోక, ఏం చదవాలో.. ఎలా చదవాలో తెలియక విజయం సాధించలేకపోతారు. మరి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఎలా సిద్ధమవ్వాలి..? ఎలా చదివితే మనమనుకున్నది సాధించొచ్చులాంటి విషయాలను క్షుణ్నంగా వివరించారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్.