నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
వ్యక్తిగత భాగాలను తరచూ నీళ్లతో శుభ్రపరుస్తూ ఉండాలి. చుట్టుపక్కల స్రావానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చూసుకోవాలి.
బ్లీడింగ్ బాగా అయ్యే రోజులతో పాటు, తక్కువగా అవుతున్న రోజుల్లోనూ తరచూ న్యాప్కిన్లు మార్చుకోవాలి. కప్ అయినా, ట్యాంపూన్లు అయినా.. ఇలాగే చేయాలి. రక్తస్రావం తక్కువ అవుతున్నది కదా అనే కారణంతో.. గంటల తర్వాత కూడా మార్చకపోతే ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
ఆ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. పొట్ట భాగానికి మరీ ఒత్తిడి
కలిగించే కసరత్తులు వద్దు.
రుతుక్రమ సమయంలో తక్కువ కార్బొహైడ్రేట్లు, చక్కెరలు కలిగిన సమతులాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ద్రవ పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు, మొలకలు, పాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.