RR vs SRH : టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌కు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. విధ్వంసక ఆటతో ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెట్టిన వైభవ్ సూర్యవంశీ(0)ని తొలి బంతికే ఔట్ చేశాడు ప్రఫుల్ హింగే(4-6). వైభవ్ గోల్డెన్ డక్ అవ్వడంతో షాకైన రాజస్థాన్‌కు మరో ఝలక్ ఇస్తూ.. ధ్రువ్ జురెల్(0), ప్రిటోరియస్(0)లను ఔట్ చేశాడు ప్రఫుల్. అంతే.. ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్.
బ్యాటర్లు ఎడాపెడా దంచేసినా బౌలర్లే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంచేవారు. పంతొమ్మిదో సీజన్లోనూ ఓడిన మూడు మ్యాచుల్లో బౌలర్లే విలన్లు. కానీ, ఈసారి సీన్ రివర్సైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌కు ముచ్చెమటలు పట్టించాడు ప్రఫుల్ హింగే(4-6). మొదటి బంతికే వైభవ్ సూర్యవంశీ(0)ని బోల్తా కొట్టించాడీ కుర్రాడు. పెద్ద షాట్ ఆడాలనుకున్న వైభవ్ బంతిని వికెట్ల వెనకాల గాల్లోకి లేపగా.. వికెట్ కీపర్ సలీల్ అరోరా ఒడుపుగా అందుకున్నాడు.
Vaibhav Sooryavanshi ✅
Praful Hinge ✅
Lhuan-dre Pretorius ✅A dream start for Praful Hinge on his #TATAIPL debut 🧡
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/RKGW3NxM5y
— IndianPremierLeague (@IPL) April 13, 2026
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ధ్రువ్ జరెల్(0)ను బౌల్డ్ చేశాడీ పేసర్. అంతేనా.. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ప్రిటోరియస్(0)ను ఔట్ చేసి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు ప్రఫుల్. ఆ తర్వాతి ఓవర్లో యశస్వీ జైస్వాల్(1)ను షకీబ్ హుస్సేన్ ఔట్ చేయడంతో 2 పరుగులకే రాజస్థాన్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.