Hormuz toll | హర్మూజ్ గుండా వెళ్లే భారత చమురు నౌకలకు నో టోల్ ఫీజు : ఇరాన్
Hormuz toll | హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజును వసూలు చేయడం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.
Hormuz toll : హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజును వసూలు చేయడం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలోనూ సానుకూల సంబంధాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. భారత్‌తో ఉన్న మైత్రి కారణంగా రవాణా ఉచితంగా సాగుతోందని అన్నారు.
అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ తమ డిమాండ్లకు అనుకూలంగా స్పందించాలని స్పష్టంచేశారు. మా షరతులను అమెరికా అంగీకరిస్తే మరో విడత చర్చలు సాధ్యమవుతాయని అన్నారు. ఇటీవల తాత్కాలిక యుద్ధ విరమణ అనంతరం చర్చల సందర్భంగా అమెరికా అంగీకార యోగ్యం కాని డిమాండ్లు తమ ముందు ఉంచిందని పేర్కొన్నారు. అందుకే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని చెప్పారు.
ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై మహమ్మద్ ఫతాలీ స్పందిస్తూ.. ఇరాన్ సామర్థ్యం గురించి వాషింగ్టన్కు తెలుసని అన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో భారత్, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

