RR vs SRH | ఉప్పల్‌లో ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ హిట్లర్లను అడ్డుకుంటేనే రెండో విజయం..?
RR vs SRH : సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చితక్కొట్టారు. ఓపెనర్లు విఫలమైనా కెప్టెన్ ఇషాన్ కిషన్ (91) తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
RR vs SRH : సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చితక్కొట్టారు. ఓపెనర్లు విఫలమైనా కెప్టెన్ ఇషాన్ కిషన్ (91) తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలో భయపెట్టిన ఆర్చర్, బర్గర్‌ను ఉతికేసిన ఇషాన్… హెన్రిచ్ క్లాసెన్(40)తో 88 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అనంతరం లోకల్ బాయ్ నితీశ్ రెడ్డి(28), ఆఖర్లో సలీల్ అరోరా(24 నాటౌట్)లు రాజస్థాన్ బౌలర్లను దంచేశారు. చివరి ఓవర్లో 14 పరుగులు రావడంతో రాజస్థాన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది సన్‌రైజర్స్.
టాస్ ఓడిన హైదరాబాద్‌కు జోఫ్రా ఆర్చర్ తొలి బంతికే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను(0) గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(18) జతగా ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఉరికించాడు. సిక్సర్లతో విరుచుకుపడిప ఇషాన్ పర్ ప్లేలో 51 రపరుగుల చేసింది. ఆ తర్వాతి ఓవర్ల రియాన్ పరాగ్ హెడ్‌ను బోల్తా కొట్టించగా.. హెన్రిచ్ క్లాసెన్ (40) అండతో ఇషాన్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్లను ఔట్ చేసిన ఆనందంలో ఉన్న రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తించారిద్దరూ.
Unstoppable 🔥@SunRisers Captain Ishan Kishan is putting on a show and HOW 🧡
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/0wOceq9d8n
— IndianPremierLeague (@IPL) April 13, 2026
అరోరా విధ్వంసం..
క్లాస్ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించిన ఇషాన్ ఆర్చర్ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లతో స్కోర్ 140కి చేరింది. అదే ఊపులో సెంచరీ కొట్టేలా కనిపించిన ఇషాన్‌ను సందీప్ శర్మ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అనంతరం క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి(28), సలీల్ అరోరా(24 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్లో దేశ్‌పాండే తొలి ఐదు బంతులకు ఒకే ఫోర్ ఇచ్చినా.. ఆఖరి బంతిని సలీల్ స్టాండ్స్లోపి పంపాడు. దాంతో 220పైగా కొడుతుందనుకున్న సన్‌రైజర్స్ 216కే పరిమితమైంది.
Three 6️⃣s in the over! 💥💥💥
🎥 Nitish Kumar Reddy ensured @sunrisers have a 200-plus total tonight 👊
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/dSLEcjHOZg
— IndianPremierLeague (@IPL) April 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

