Prabhas Rejected Movies | ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటులలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ హీరోల సైతం తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటారు. పోస్టర్‌పై ప్రభాస్ పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అయిన ప్రభాస్ క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్‌తో 400కోట్ల కలెక్షన్లు సాధించిన ఏకైకా హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కలెక్షన్లు ఒక స్టార్ హీరో హిట్ కలెక్షన్లకు సమానంగా ఉంటాయి. ఇక ప్రభాస్ ఇప్పటివరకు 20 చిత్రాలను చేశాడు. ఇందులో కేవలం 7 చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అయితే ప్రభాస్ చాలా హిట్ సినిమాలను కూడా వదులుకున్నాడు. అవేంటంటే.
ఒక్కడు:
మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అయితే ముందుగా ఈ కథను గుణశేఖర్.. ప్రభాస్, కృష్ణంరాజులకు వినిపించాడట. కానీ ప్రభాస్‌కు ఈ సినిమా సెట్ కాదని రిజెక్ట్ చేశాడట. అయితే ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. మహేష్‌బాబుకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
దిల్:
దిల్ సినిమాను వి.వి వినాయక్ ముందుగా ప్రభాస్‌కు నెరేట్ చేశాడట. కానీ ప్రభాస్ వేరే ప్రాజెక్ట్‌తో బిజీ ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత నితిన్ దగ్గరకు స్క్రీప్ట్ వెళ్లిందట. ఈ సినిమా నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రొడ్యూసర్‌గా దిల్‌రాజుకు కాసుల వర్షం కురిపించింది.
స్టూడెంట్ నం.1:
దర్శక దిగ్గజం రాజమౌళి డెబ్యూ సినిమా స్టూడెంట్ నం.1 కథ మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట. కానీ ప్రభాస్‌కు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట. 2001 లో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా ఎన్టీఆర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఆర్య:
సుకుమార్-బన్నీ కాంబోలో తెరకెక్కిన మొదటి చిత్రం ఇది. సుకుమార్ ముందుగా ఈ చిత్రాన్ని ప్రభాస్‌కు చెప్పాడట. కానీ ప్రభాస్‌కు కాన్సెప్ట్ నచ్చకపోవడంతో సుకుమార్‌కు నో చెప్పాడట. దాంతో ఈ సినిమా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది. అటు సుకుమార్‌కు డెబ్యూగా, ఇటు అల్లు అర్జున్‌కు స్టార్‌గా ఈ చిత్రం ఇద్దరికి బ్రేక్ ఇచ్చింది.
బృందావనం:
బృందావనం కథను వంశీ పైడిపల్లి మొదట ప్రభాస్‌కు వినిపించాడట. కానీ అప్పటికి ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. అప్పటికే అదుర్స్‌తో భారీ హిట్ సాధించిన తారక్‌కు ఈ చిత్రం వరుసగా రెండో విజయంగా సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేసింది.
నాయక్:
రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా కథ ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్ళిందట. కానీ ప్రభాస్ మిర్చితో బిజీగా ఉండటంతో వి.వి వినాయక్ చరణ్‌ను అప్రోచ్ అయ్యాడట. అయితే ఈ చిత్రం ప్రభాస్ కంటే ముందు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లింది.
కిక్:
సురేందర్ రెడ్డి కిక్ కథను ముందుగా ప్రభాస్‌కు చెప్పాడట. ప్రభాస్‌కు కూడా బాగా నచ్చిందట. అయితే ప్రభాస్ డిసైడ్ అయ్యేలోపే సురేందర్ రెడ్డి రవితేజతో పట్టాలెక్కించాడు. ఈ చిత్రం రవితేజ మార్కెట్‌ను రెండింతలు పెంచింది.
డాన్ శీను:
డాన్ శీను కథను గోపిచంద్ మలినేని మొదట ప్రభాస్‌కు వినిపించాడట. అయితే ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ బుజ్జీగాడులో క్యరెక్టర్కు కొంచెం పోలిక ఉండటంతో రిజెక్ట్ చేశాడట.
ఊసరవెల్లి:
సురేందర్ రెడ్డి ఈ సినిమా కథను కూడా మొదట ప్రభాస్‌కే చెప్పాడట. కానీ ప్రభాస్‌కు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించక పోయినా.. తారక్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
జిల్:
జిల్ సినిమాను ముందుగా రాధాకృష్ణ, ప్రభాస్‌కు నెరేట్ చేశాడట. అయితే ప్రభాస్ బాహుబలితో బిజీగా ఉండటంతో గోపిచంద్‌ను రిఫర్ చేశాడట. దాంతో ఈ చిత్రం గోపిచంద్ దగ్గరకు వెళ్లింది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీనితో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలను చేస్తున్నాడు.