అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ ‘ఫౌజీ’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్లో ఉన్నాయి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ త్వరలో సెట్స్మీదకెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయని తెలుస్తున్నది. ‘యానిమల్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అందుకు తగినట్లుగానే పవర్ఫుల్ పోలీస్ కథతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట సందీప్ రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్ సిన్సియర్ అండ్ ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమా మేలో సెట్స్ మీదకు వెళ్లనుందని గతంలో వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. ‘ది రాజాసాబ్’ ‘ఫౌజీ’ షూటింగ్స్ పూర్తయిన తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం పూర్తి సమయాన్ని వెచ్చించనున్నారని, ఈ సినిమాకు ఆయన బల్క్‌డేట్స్ కేటాయించారని అంటున్నారు.