బోయినపల్లిరూరల్/ ఎల్లారెడ్డిపేట, మార్చి 13 : ఈనెల 14 నుంచి 20 దాకా భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్‌లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ హైసూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పంతం ప్రభాకర్,
అసిస్టెంట్ కోచ్‌గా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకో అఖిలను నియమించారు. గత నెల 16 నుంచి 20 వరకు వేములవాడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మార్చి 2 నుంచి 12 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించగా, ఈ జట్టుకు వీరిద్దరూ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. దీంతో రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రభాకర్‌ను రాష్ట్ర జట్టుకు కోచ్‌గా, అఖిలను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది..