e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News బెంగాల్‌, అసోంలో ప్రారంభమైన పోలింగ్‌

బెంగాల్‌, అసోంలో ప్రారంభమైన పోలింగ్‌

బెంగాల్‌, అసోంలో ప్రారంభమైన పోలింగ్‌

న్యూఢిల్లీ : పశ్చి‌మ‌బెంగాల్‌, అసోంలో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానా‌లకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌శారు. 73,80,942 మంది ఓటర్లు ఓటు వేయ‌ను‌న్నారు. అసోంలో 1,917 పోలింగ్‌ కేంద్రాల్లో 11,537 పోలింగ్‌ బూత్‌‌లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వేళ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. ఉదయం నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు.

బెంగాల్‌లో భారీ భద్రత

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. శనివారం మొదటి విడతలో30 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి విడతలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పురులియా, బంకురా, జార్‌గ్రామ్‌, పుర్బా మేదినిపూర్‌, పశ్చిమ మేదినిపూర్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 1,307 పోలింగ్‌ బూత్‌లన్నింటినీ నక్సల్స్‌ ప్రభావిత ప్రకటించగా.. 144 కేంద్ర బలగాల జార్‌గ్రామ్‌లో అధికారులు మోహరిస్తున్నారు. బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 74లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

అసోంలో మొదటి విడతలో ప్రముఖులు

అసోంలో మొదటి విడ‌తలో పోటీ‌ప‌డు‌తున్న అభ్యర్థులు ఎక్కు‌వగా ప్రము‌ఖులే ఉన్నారు. సీఎం సర్బా‌నంద్‌ సోనో‌వాల్‌, అసెంబ్లీ స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రిపు‌న్‌‌బోరా, పలు‌వురు మంత్రులు మొదటి దశలో తల‌ప‌డు‌తు‌న్నారు. రాష్ట్ర అసెం‌బ్లీలో మొత్తం 126 సీట్లుం‌డగా మూడు దశల్లో ఎన్ని‌కలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో పోలింగ్‌ జరు‌గు‌తున్న 47 స్థానాల్లో 23 మంది మహి‌ళలు సహా మొత్తం 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్ని‌కల్లో అధి‌కార బీజే‌పీ–‌అస్సాం గణ‌ప‌రి‌షత్‌, కాంగ్రెస్‌ నేతృ‌త్వం‌లోని మహా‌కూ‌టమి, కొత్తగా ఏర్పా‌టైన అసోం జతియా పరి‌షత్‌ (ఏ‌జేపీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్‌, అసోంలో ప్రారంభమైన పోలింగ్‌

ట్రెండింగ్‌

Advertisement