రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు!
రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు! | కరోనాకు మందు పంపిణీ చేస్తున్న కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయనను తీసుకెళ్లారు.

అమరావతి : కరోనాకు మందు పంపిణీ చేస్తున్న కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయనను తీసుకెళ్లారు. మరో వైపు మందు కోసం కృష్ణపట్నానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ నిలిపివేయడంతో ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది.
ఔషధంపై సోమవారం నివేదిక రానుండగా.. అప్పటి వరకు రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కృష్ణపట్నంలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా.. విజయవాడ పరిశోధన కేంద్రం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్కు సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారని సమాచారం.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

