e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News పోలీసులకు బాసులైనా..పిల్లలకు అమ్మలే !

పోలీసులకు బాసులైనా..పిల్లలకు అమ్మలే !

వారంతా పవర్‌ఫుల్‌ ఉమెన్‌ పోలీస్‌ ఆఫీసర్లు.. వృత్తి పరంగా ఎంతో ఒత్తిడి.. మరెన్నో బాధ్యతలతో నిత్యం బిజీ బిజీగా ఉంటారు. శాంతి భద్రతలు, నేర నిర్మూలనలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఉద్యోగ సమయంలో వృత్తే దైవంగా భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైనప్పుడు చేతిలో లాఠీలతో హడలెత్తిస్తారు. అలా కఠినంగా వ్యవహరించే వారికీ ఓ కమ్మని మనసు ఉంది. ఎంతగానో ప్రేమించే అందమైన కుటుంబం ఉంది. వృత్తిలో బాధ్యతగా వ్యవహరించే ఈ సూపర్‌ కాప్స్‌ ఇంటికెళ్లగానే సూపర్‌ మామ్స్‌ అయిపోతున్నారు. కుటుంబంలో తానూ ఒకరిగా, పిల్లలకు తల్లిగా అనేక బాధ్యతలు మోస్తూ విభిన్న పాత్రల్లో ఒదిగిపోతున్నారు.

ఇంటి సభ్యులు, పిల్లల ఆరోగ్యం కోసం.. వారి ఆనందం కోసం.. లాఠీ పట్టిన చేతులతోనే గరిట తిప్పుతున్నారు. వృత్తి జీవితంలోని ఒత్తిడినంతా కిచెన్‌లో వంట చేస్తూ క్షణాల్లో మరిచిపోతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా సరదాగానో, సంబురంగానో కిచెన్‌లో సమయాన్ని గడుపుతున్నారు. రోజూ కాకపోయినా వారంలో మూడు రోజులు, నెలలో నాలుగు రోజులు వంటింట్లో అద్భుతాలు
సృష్టిస్తున్నారు. నచ్చిన వారికి నచ్చింది వండి పెడుతూ ఇష్టంగా వంట చేస్తూ మురిసిపోతున్న లేడీ పోలీసు ఆఫీసర్లు వారి కిచెన్‌ సీక్రెట్స్‌ను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.

ఆరోగ్యవంతమైన భోజనంతో ఉషారు

- Advertisement -

పిల్లలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందేలా చూసుకుంటా. నూనె వస్తువులు అధికంగా లేకుండా చూసుకుంటా. పిల్లలు ఇష్టపడే జంక్‌ఫుడ్‌ను పోషకాలతో కూడిన ధాన్యాలు, హాని చేయని సామగ్రితో వారికి అందిస్తా. నూడుల్స్‌, పాస్తాలను గోధుమ పిండితో తయారీ అయిన వాటితో తయారు చేస్తా. ఆరోగ్యవంతమైన భోజనాన్ని తీసుకునేందుకు వారికి సూచనలు చేస్తుంటా. ఉద్యోగ రీత్యా బిజీగా ఉన్నా సెలవులు, వీకెండ్స్‌, వారంలో మూడు రోజుల పాటు కచ్చితంగా ఇంట్లోని కిచెన్‌లో నా చేతితో వంటను తయారు చేస్తాం.- స్వాతి లక్రా, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, అదనపు డీజీపీ

రుచిగా వండడం నాకిష్టం

బాధితులకు సత్వర పోలీసుసేవలను అందించినప్పుడు కలిగే సంతోషం వృత్తి పరంగా సంతృప్తినివ్వగా.. ఇంట్లో పిల్లలకు, కుటుంబ సభ్యులకు నా చేతితో వంట చేసి పెట్టడం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. దీని కోసం ధమ్‌ బిర్యానీతో పాటు అనేక రకమైన రుచికరమైన వంటలను తయారు చేయడం మహదానందాన్ని కలిగిస్తుంది. దీనికి తోడు నేను చేసిన వంటను పిల్లలు, కుటుంబ సభ్యులు ఇష్టపడి తినే సందర్భం నా సంతోషానికి అవధులు ఉండవు. వారికి వంట చేయడం నేను పూర్తిగా అస్వాదిస్తా. కచ్చితంగా రోజు వంట ఇంట్లో నా చేతి వంటను తయారు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాను. వంట వండడం కూడా ఓ కళ.- సుమతి డీఐజీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌

మసాలా వంకాయ బాగా చేస్తాను..

నేను చేసే చికెన్‌ బిర్యానీ.. చికెన్‌ ఫ్రై అంటే మా పిల్లలకు, కుటుంబసభ్యులకు చాలా ఇష్టం. ఈ వంటలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తలను తీసుకుంటాను. ఇలా సమయం దొరికనప్పుడల్లా పిల్లలకు ఇంట్లో వారికి పసందైన భోజనం పెట్టడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండేలా ఎప్పటికప్పుడు వారికి ఇష్టమైన వంటలను చేస్తాను. వీలుచిక్కినపుడల్లా నేను మసాలా వంకాయ కూర బాగా చేస్తాను.

బీరకాయ, ఎగ్‌ కర్రీ అదుర్స్‌..

నేను బీరకాయ, ఎగ్‌ కర్రీ వండితే చాలు నా పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి వంట అదుర్స్‌ అంటూ కితాబులు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. విధుల్లో బిజిగా ఉన్నా ఇంట్లో వారికి భోజనం తయారు చేయడంతో కలిగే ఆనందం వర్ణణాతీతం.రుచికరమైన వంటతో వారు పొందే ఆనందం నాకు గర్వంగా ఉంటుంది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా కిచెన్‌లో సరికొత్త రుచికరమైన వంటలకు ప్రయత్నిస్తా..- సలీమా, షీ టీమ్స్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement