హైదరాబాద్ : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై(Rowdy sheeters) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో పలు చోట్ల రౌడీల ఆగడాలు మితిమీరిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు(Drug tests) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉండగా 250 మందికి పైగా డ్రగ్ టెస్టులను నిర్వహించారు.
ఇందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్దారించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.