న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఇవాళ లోక్‌సభలో ప్రధాని మోదీ రిప్లై ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఎంపీలందరూ సభకు హాజరుకావాలన్నది. ఇక లోక్‌సభలోనూ వీలైనంత వరకు ఎంపీలందరూ హాజరుకావాలంటూ ఆదేశించింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చకు ప్రధాని మోదీ లోక్‌సభలో సోమవారం మాట్లాడుతారని, రాజ్యసభలో మంగళవారం మాట్లాడనున్నట్లు తెలిపారు. ప్రెసిడెంట్ ప్రసంగానికి లోక్‌సభలో 98 సవరణలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేయలేదు.