Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని | ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగే కార్యక్రమానికి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొననుండగా..

న్యూఢిల్లీ : ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగే కార్యక్రమానికి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొననుండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించి, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉజ్వల స్కీమ్‌ను 2016లో ప్రారంభించగా.. ఆ సమయంలో ఐదు కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష్యంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం 2018లో పథకాన్ని మరో ఏడు వర్గాలకు వర్తింపజేస్తూ.. లక్ష్యాన్ని ఎనిమిది కోట్లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యాన్ని చేరారు.
2021 -22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో ఎల్పీజీ అందుకోలేకపోయిన తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించాలని నిర్ణయించింది. ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నారు. అలాగే ఉజ్వల స్కీమ్‌లో నమోదు కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే కనెక్షన్ ఇవ్వనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

