జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders) వినూత్న నిరసన తెలిపారు. గారేపల్లి చిన్న కాళేశ్వరం పంపు హౌస్కు పిండ ప్రధానం ( Pindapradhanam) చేశారు. గత 18 ఏళ్లుగా చిన్న కాళేశ్వరం పనుల్లో జాప్యం, ఏడాదిలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్టును విస్మరించాడని ఆరోపించారు. కనీసం భూ నిర్వాసితులకు ఏళ్లుగా పరిహారం అందక విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.