ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 30: తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ అమరులైన 1,200 మంది త్యాగాలను ఎవరైనా అవమానపరిస్తే అంతు చూస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఏపీ మంత్రి వ్యాఖ్యలపై ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రెండు రాష్ర్టాలను కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అశోక్‌యాదవ్, హరీశ్‌గౌడ్, రవీందర్‌నాయక్, మాందాల భాస్కర్, దత్తాత్రి, నాగరాజు, అనిల్, వినయ్, షణ్ముఖచారి తదితరులు పాల్గొన్నారు.