7వ పీఆర్సీ బకాయిలు అందేదెప్పుడో?
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు 7వ వేతన సవరణ బకాయిలు అందని ద్రాక్షగా మిగిలాయి.
- డిగ్రీ లెక్చరర్లకు ఇంకా అందని మూడున్నరేండ్ల బకాయిలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మొరపెట్టుకున్న టీజీసీటీఏ
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు 7వ వేతన సవరణ బకాయిలు అందని ద్రాక్షగా మిగిలాయి. మూడున్నరేండ్ల బకాయిలు అందకుండాపోయాయి. ఫలితంగా అధ్యాపకులకు నిరీక్షణ తప్పడంలేదు. ప్రభుత్వం ఖాతాల్లో వీటిని జమచేసినా చేతికి అందకపోవడంతో దాదాపు 900 మంది అధ్యాపకులకు అవస్థలు తప్పడంలేదు.
సీపీఎస్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమారను కలిసి మొరపెట్టుకున్నారు యూజీసీ నిబంధనల ప్రకారం పదేండ్లకోసారి కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఏడో వేతన సవరణ 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి 2019 జూన్ 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 900 మంది సీపీఎస్ అధ్యాపకులకు మూడున్నరేండ్ల (మూడేండ్ల ఆరు నెలలు) వేతన సవరణ బకాయిలు మాత్రం ఇప్పటికీ అందలేదు. ఈ మొత్తాలను ప్రభుత్వం సంబంధిత ఉద్యోగుల సీపీఎస్ /సీఎస్ఎస్ , జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసినప్పటికీ వాటిని విత్ డ్రా చేసుకుని వినియోగించుకునే వెసులుబాటు కల్పించలేదు. దీంతో ఖాతాల్లో కనిపిస్తున్నా.. ఇవి అవసరాలకు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అధ్యాపకులు ఆయా మొత్తాన్ని వాడుకునే అవకాశం లేకుండా పోయింది.
వర్సిటీలకు ఇచ్చి.. మాకివ్వరా?
రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఏడో వేతన సవరణ బకాయిలు అందాయి. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకుల విషయంలో మాత్రం వివక్షను చూపుతున్నారని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్ పేర్కొన్నారు. వర్సిటీకిచ్చి మాకు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు.
కేంద్రం ఎనిమిదో వేతన సవరణ అమలుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పటికీ ఏడో వేతన సవరణ బకాయిల కోసం తాము ఇంకా వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. డిగ్రీ కాలేజీల్లో అన్ని సబ్జెక్టుల బోధనకు 400 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఇక వెయ్యి మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టును మంజూరు చేయాలని, ప్రతి కాలేజీకి ఒక టీఎస్కేసీ (టాస్క్) మెంటార్ పోస్టును కేటాయించాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

