Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ మూవీ గురించి వస్తున్న కొత్త అప్డేట్లు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇదే సమయంలో ఓ కొత్త పోస్టర్‌కు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఒకవైపు క్రికెటర్‌గా, మరోవైపు కుస్తీ ఫైటర్‌గా ఆయన పాత్రలు ఉండనున్నాయని ముందే వెల్లడైంది. ఈ రెండు లుక్స్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చిన వేళ, ఇప్పుడు మూడో స్పోర్ట్‌కు సంబంధించిన షేడ్ కూడా ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.
ఈ కొత్త షేడ్‌కు సంబంధించిన పోస్టర్ త్వరలో విడుదల కానుందని, అందులో చరణ్ మరింత భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. క్రీడల నేపథ్యంతో పాటు భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని టాక్. పెద్ది చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఈ మూవీ జూన్ 25న విడుదల కానుందని, ఇటీవల వార్తలు రాగా, ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ‘పెద్ది’ సినిమా నుంచి రాబోయే కొత్త పోస్టర్, మూడో షేడ్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే వరకు ఈ రూమర్స్ మరింత వేడెక్కే అవకాశముంది.