Peddi | ‘పెద్ది’లో రామ్ చరణ్ మూడో షేడ్ .. కొత్త పోస్టర్‌తో అంచనాలు మరింత పెంచే ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు
Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ మూవీ గురించి వస్తున్న కొత్త అప్డేట్లు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇదే సమయంలో ఓ కొత్త పోస్టర్‌కు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ మూవీ గురించి వస్తున్న కొత్త అప్డేట్లు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇదే సమయంలో ఓ కొత్త పోస్టర్‌కు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఒకవైపు క్రికెటర్‌గా, మరోవైపు కుస్తీ ఫైటర్‌గా ఆయన పాత్రలు ఉండనున్నాయని ముందే వెల్లడైంది. ఈ రెండు లుక్స్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చిన వేళ, ఇప్పుడు మూడో స్పోర్ట్‌కు సంబంధించిన షేడ్ కూడా ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.
ఈ కొత్త షేడ్‌కు సంబంధించిన పోస్టర్ త్వరలో విడుదల కానుందని, అందులో చరణ్ మరింత భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. క్రీడల నేపథ్యంతో పాటు భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని టాక్. పెద్ది చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఈ మూవీ జూన్ 25న విడుదల కానుందని, ఇటీవల వార్తలు రాగా, ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ‘పెద్ది’ సినిమా నుంచి రాబోయే కొత్త పోస్టర్, మూడో షేడ్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే వరకు ఈ రూమర్స్ మరింత వేడెక్కే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- buchi babu
- glimpse
- new poster
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

