నాగర్కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని ఫర్హాబాద్ గుండం సమీపంలో మంగళవారం సఫారీ యాత్రికులకు మరోసారి పెద్దపులి కనిపించింది. ఏటీఆర్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సఫారీ యాత్రలో నాలుగైదు సార్లు పెద్దపులి కన్పించిందని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు.