పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు నిరసన సెగ
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కాంగ్రెస్ నాయకులు, సర్పంచుల నుంచే నిరసన సెగ తగిలింది.
కాల్వశ్రీరాంపూర్, నవంబర్17: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కాంగ్రెస్ నాయకులు, సర్పంచుల నుంచే నిరసన సెగ తగిలింది. మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో పింఛన్పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు రాకముందే ఎంపీ వంశీకృష్ణ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వివరించి తిరిగి వెళ్లే సందర్భంలో సర్పంచులు తులా మనోహర్రావు, బంగారి రమేశ్, మాజీ సర్పంచ్ మాదాసి సతీశ్తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంపీని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎంపీ స్టేజీ దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

