‘వకీల్ సాబ్’ పై కరోనా ఎఫెక్ట్..తగ్గుతున్న వసూళ్లు..!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రయాణం తొలి ఐదు రోజులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రయాణం తొలి ఐదు రోజులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. ఒకవైపు వైరస్ విజృంభిస్తున్నా కూడా మరోవైపు థియేటర్లకు అభిమానులు, ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కరోనా వైరస్ అనే విషయాన్ని కూడా వాళ్లు మరిచిపోయారు. అందుకే కలెక్షన్లు కూడా అద్భుతంగా వచ్చాయి. పైగా ఉగాది సెలవులు కూడా రావడంతో తొలి ఐదు రోజులు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు వకీల్ సాబ్. అయితే ఆ రోజు నుంచి ఈ సినిమా దూకుడు తగ్గింది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్స్ నెమ్మదించాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
వైరస్ ఉన్నా కూడా పవర్ స్టార్ మేనియాతో తొలి ఐదు రోజులు ఎదురు లేకుండా వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసేయడం.. మరోవైపు రోజురోజుకు కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు ఆడియన్స్. అందుకే 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. మ్యాట్నీస్ కూడా 50% మాత్రమే ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఉగాది రోజు వకీల్ సాబ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేసింది. సెలవు రోజు కావడంతో దాదాపు 9 కోట్ల షేర్ తీసుకొచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఇప్పటికే దాదాపు 76 కోట్లు వకీల్ సాబ్ వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 90 కోట్లు వసూలు చేయాలి. వైరస్ కారణంగా ఇప్పటికే సినిమాలన్నీ వాయిదా వేస్తూ ఉండడంతో ప్రేక్షకులకు పవన్ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు. అలాగే మెల్లగా నడుస్తూ నడుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటుందని డిస్ట్రిబ్యూటర్లు బలంగా నమ్ముతున్నారు. ఏదేమైనా కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి.. దానికి ఎదురు నిలిచి ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం మాత్రం చిన్న విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరో చేయని సాహసం చేశాడు. మొత్తానికి మరి చూడాలి మన లాయర్ సాబ్ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో.
ఇవి కూడా చదవండి..
బన్నీ-కొరటాల సినిమాపై అనుమానాలు..!
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

