Pawan kalyan | పవన్ కళ్యాణ్ లైనప్‌లో ‘వినోదయ సిత్తం’ రీమేక్ ఒకటి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు. ఇప్పటికే సెట్స్ నుంచి లీకైన ఫోటోలు నెట్టింట దుమారం రేపాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మనిషి రూపంలో ఉన్న దేవుడిగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది.
ఈ సినిమాకు ‘బ్రో:ది అవతార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ పవన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో పవన్ స్టయిలిష్ లుక్‌లో మంచి ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత పాత పవన్ కళ్యాణ్‌ను చూసినట్టు అనిపిస్తుంది. స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ ఇలా మూడు కలబోసినట్లుగా పవన్ కళ్యాణ్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్‌తో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టైటిల్ మోషన్ పోస్టర్లో నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. బ్రో టైటిల్లో టైమ్‌ను కూడా ప్రజెంట్ చేస్తూ ఈ సినిమా థీమ్‌ను చెబుతున్నారు.
ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది.
దాదాపు అటు ఇటుగా ఇలాంటి కథలను మనం చాలా సార్లు చూశాం. అయితే సముద్రఖని తన స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు. తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను సాయిధరమ్ తేజ్ చేస్తున్నాడు. దేవుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే పవన్ షూటింగ్ పూర్తయిపోయిందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.