Pawan Kalyan |సోషల్ మీడియాలో రోజుకో హీరో సినిమా విడుదలైతే చాలు, కామెంట్ల యుద్ధం, నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్లు, పర్సనల్ స్థాయికి వెళ్తున్న మాటల తూటాలు… ఇవే ఇప్పుడు టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ తొలిసారి గళం విప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ గురించి OG సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, మిగతా హీరోల అభిమానులందరికీ ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు.“అందరూ కలిసి సినిమాని నిలబెట్టాలి, కాదు అంటే సినిమానే చచ్చిపోతుంది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి గారు, నాని… ఈ అందరినీ నేను అభిమానిస్తాను. వాళ్ల వర్క్‌ని గౌరవిస్తాను. నేను ఆర్ట్‌ని ప్రేమించేవాడిని. ఒక అభిమాని, ఇంకో హీరోని ద్వేషిస్తున్నాడంటే, అది మన మనసులో ఉన్న లోపాన్ని సూచిస్తుంది.
అలాగే అందరి అభిమానులకి చెబుతున్నాను. ఈ ఫ్యాన్ వార్స్ ఆపేయండి. ప్రతి సినిమాలో నటీనటులు రాత్రింబవళ్లు కష్టపడతారు. సినిమా వృద్ధికి తోడ్పడాల్సిన అభిమానులు ఒకరి సినిమాకు మరొకరిని బలిచేసే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తే, కేవలం ఫ్యాన్ వార్స్ వల్లే కొన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. గేమ్ ఛేంజర్, దేవర, హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ట్రోలింగ్కి బలైపోయాయని ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని హైలైట్ చేశారు. తాను ఎవర్నీ ద్వేషించనని, ప్రతి నటుడిని గౌరవిస్తానని, తమ అభిమానులు సహా మిగతా హీరోల అభిమానులందరికీ ఇదే తన అభ్యర్థన అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఆపండి. ఒకరినొకరు అభినందించండి. పాజిటివ్ ఎనర్జీ పంచుకోండి. లేకపోతే సమాజంలో అగ్లీ నెస్ పెరుగుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమానులు పవన్ మాటలు ఎంతో దార్శనికంగా ఉన్నాయని ప్రశంసిస్తుండగా, మరికొంతమంది “ఇప్పుడైనా మారుదాం” అంటూ ట్రెండ్స్ చేస్తున్నారు. కానీ నిజంగా అభిమానులు ఈ మాటల ప్రభావంతో మారతారా? లేక పాత ట్రెండ్‌నే కొనసాగిస్తారా అన్నది చూడాలి.