Pala pitta | దసరా రోజున పాలపిట్టనే ఎందుకు చూడాలి..? అసలేంటి పాలపిట్ట కథ..!
Pala pitta | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామశివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
Pala Pitta | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామశివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శమీవృక్షాన్ని పూజించి దసరా వేడుకను ఉత్సాహంగా చేసుకుంటారు. తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితి. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించడం, సీమోల్లంఘనంతోపాటు పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

