Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన 25వ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగింది. “కుర్చీ మడతపెట్టి” పాటతో ఎపిసోడ్‌కు ఊపొచ్చింది. ఈ ఎపిసోడ్లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, లవ్, ఆటలు అన్నీ కలగలిపి ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చాయి. హౌస్‌లో భరణి ఒక్కరుగా ఉండటం చూసి సంజన భావోద్వేగానికి గురైంది. “అందరితో కలిసిపోవడం లేదు” అంటూ బాధపడిపోయింది. అయితే భరణి అందుకు గట్టి సమాధానం ఇచ్చాడు. “పది మంది మధ్య ఒంటరిగా ఉండటమంటే, అది వాళ్లే క్రియేట్ చేసుకున్న పరిస్థితి.” భరణి మౌనంగా ఉన్నా, మాటల తూటాలు వదలటం లేదనిపించింది.
ఇమ్మానుయేల్ మళ్లీ తన కామెడీ మోడ్‌కి వచ్చేశాడు. తనూజను ఆటపట్టిస్తూ – “దిస్ ఈజ్ యాక్టింగ్.. సీరియల్ యాక్టింగ్” అంటూ నవ్వులు పంచాడు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ మాత్రం మాములుగా లేదు. ఇక ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో రొమాన్స్ టచ్ కనిపించింది. రీతూ, తనూజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్ పడాల, శ్రీజలు కలిసి “ట్రూత్ ఆర్ డేర్” ఆడినప్పుడు ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ చోటుచేసుకున్నాయి. తనూజకి వచ్చిన ట్రూత్ ప్రశ్నలో “నీ బాయ్‌ఫ్రెండ్ పేరు?” అంటే ఆమె నవ్వుతూ “హృతిక్ రోషన్” అని చెప్పింది. తర్వాతి ప్రశ్న కళ్యాణ్‌కి రాగా, “ఈ హౌస్‌లో లవ్ చేయొచ్చు అనిపించే వారు?” అని అడిగితే “తనూజ” పేరు చెప్పేశాడు కళ్యాణ్. వెంటనే తనూజకి వచ్చిన మరో ట్రూత్‌లో తన ఫస్ట్ లవ్ స్టోరీని పంచుకుంది. 8వ తరగతిలో డాన్స్ క్లాస్‌లో మొదలైన లవ్ స్టోరీ ఇది.. అతని పేరు కూడా కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది.
డాన్స్ క్లాస్‌లో నా ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ కాగా, అతను నాకు డైరెక్ట్‌గా గ్రీటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతనే. తను చాలామంచోడు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అది చాలా క్యూట్ లవ్ స్టోరీ.. బట్ వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి. తను ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నాడు. తనకి పెళ్లైపోయింది అంటూ ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది తనూజ. ఆ తరువాత మళ్లీ డేర్ రావడంతో.. కళ్యాణ్ పడాలతో కలిసి స్టెప్లు వేసింది తనూజ. డేర్ టాస్క్‌లో భాగంగా తనూజ, కళ్యాణ్ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ స్టెప్పులు చూడటానికి ఫ్యాన్స్ ముచ్చటపడేలా చేశాయి. కళ్యాణ్ మాత్రం ఈ ఎపిసోడంతా తన కామెంట్‌తో హాట్ టాపిక్ అయ్యాడు. మరో పక్క రీతూ, డీమాన్ పవన్‌ల మధ్య బాండింగ్ పీక్ స్టేజ్‌కి చేరింది. ఇద్దరూ ఇప్పుడు మంచం కూడా పంచుకుంటున్నారు. ఇది చూసిన ఇమ్మానుయేల్ “బిగ్ బాస్.. వీళ్లు పడుకున్నారు” అంటూ సెటైర్లు వేసాడు. అయితే ఇద్దరూ “మేము పడుకోలేదు” అంటూ మళ్ళీ మైండ్ గేమ్‌కి దిగిపోయారు.