Narne Nithin | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2023 అక్టోబర్ 6న ‘మ్యాడ్’ (Mad) చిత్రంతో ప్రేక్షకులని అలరించాడు ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత శోభన్ , రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో మేకర్స్ మాత్రం సంగీత్ శోభన్ హీరో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అందుకే సంగీత్ శోభన్ కే డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. ఇక 2024 ఆగస్ట్ 15న నితిన్ నటించిన (Aay) మూవీ వచ్చింది. ఈ సినిమాలో నార్నే నితిన్ సోలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ‘మ్యాడ్’కు సీక్వెల్ గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 28న విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది.
మ్యాడ్’ను తెరకెక్కించిన కళ్యాణ్ శంకరే ఈ మూవీనీ డైరెక్ట్ చేయగా, చిత్ర క్లైమాక్స్ లో అసలు సిసలు ట్విస్ట్ ఇచ్చేది నార్నే నితినే! సో.. ఈ మూవీ వరకూ అతనే హీరో అని చెప్పాలి.ఇక నార్నే నితిన్ నటించిన శ్రీ శ్రీ రాజావారు చిత్రం విడుదల కావల్సి ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం నితిన్.. శివానీ అనే యువతిని నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 3న హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది.
ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, హీరో కళ్యాణ్ రామ్, వెంకటేష్, రానా దగ్గుబాటి, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తదితరులు హాజరై నూతన జంటకు ఆశీర్వాదాలు అందించారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన కుమారులు అభయ్, భార్గవ్ తో కలిసి వేడుకలో సందడి చేసింది. కాగా, శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. నార్నే – దగ్గుబాటి కుటుంబాలు ఈ నిశ్చితార్థంతో సంబంధాలు కుదుర్చుకున్నాయి.ఇక పెళ్లి ఎప్పుడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. అక్టోబర్ 10న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు టాక్. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు మొదలైనట్టు తెలుస్తుంది.