Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో OG సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ కావడంతో 800K డాలర్స్ OG కలెక్ట్ చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మొత్తాన్ని 1 మిలియన్ డాలర్స్‌కి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది తెలుగు సినిమాల ప్రీమియర్ బుకింగ్స్‌లో అరుదైన ఘనత.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నైజాం ఏరియా OG ఫస్ట్ టికెట్‌ను వేలం పాట వేసారు. ఈ కార్యక్రమం ఓ ట్విట్టర్ స్పేస్‌లో నిర్వహించగా, తెలుగు రాష్ట్రాలు, అమెరికా నుంచి భారీగా ఫ్యాన్స్ పాల్గొన్నారు. చివరకు ఈ టికెట్‌ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఏకంగా ₹5 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి ఫండింగ్‌గా అందిస్తామని ప్రకటించారు. మూడు రోజుల్లోనే ఆ డబ్బును పార్టీకి అందజేస్తామని స్పష్టం చేశారు. అభిమానులు చేస్తున్న పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ‘OG ఫస్ట్ టికెట్ ఆక్షన్’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
ఒక్క టికెట్‌కు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతోనే జరిగిందని అభిమానులు చెబుతున్నారు. OG సినిమాపై ఉన్న హైప్, జనసేన పార్టీపై అభిమానుల నిబద్ధత దీని వెనుక కారణం. తొలి టికెట్ కే ఈ రేంజ్ క్రేజ్ అంటే, OG థియేటర్లలోకి వచ్చినప్పుడు ఎంత విధ్యంసం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ట్రైలర్ ఇంత ఆలస్యంగా రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.