HariHara VeeraMallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా మారారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనేక కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి సినిమాలు చేసే సమయం లేకుండా పోయింది. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లని అయిన పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నప్పటికీ కుదరడం లేదు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అర్ధం కావడం లేదు. కరోనా సమయంలో ఈ మూవీ ప్రకటించారు. ఐదేళ్లు అవుతున్నా కూడా సినిమాకి మోక్షం రావడం లేదు. మూవీ రిలీజ్ అని డేట్ అనౌన్స్ చేయడం, మళ్లీ వాయిదా వేయడం కామన్‌గా మారింది.
హరిహర వీరమల్లు సినిమా మొదట 2022 జనవరిలో సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అనంతరం 2022 అక్టోబర్ 5న చిత్ర రిలీజ్ అన్నారు. అది కూడా వాయిదా పడింది. ఆ తర్వాత 2023 జనవరి సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. కాని అప్పుడు వాయిదా పడింది. 30 మార్చ్ 2023 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అప్పుడు రాలేదు. 2023 దసరాకి వస్తుందన్నారు రాలేదు. 2024 సమ్మర్ కి వస్తుంది అని చెప్పిన అప్పుడు రాలేదు. ఇక 2024 డిసెంబర్ లో వస్తుంది అని హడావిడి చేసి షూటింగ్ స్పీడ్ పెంచిన కూడా రిలీజ్ కాలేదు.
26 జనవరి 2025న పక్కా అని అన్నారు కానీ రిలీజ్ అవ్వలేదు. 28 మార్చ్ 2025 రిలీజ్ ఖాయం అంటూ తెగ హడావిడి చేశారు. కాని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేసి మే 9న తప్పక విడుదల చేస్తామని అన్నారు. అయితే ఆ డేట్‌కి సినిమా విడుదల కావడం కష్టంగానే ఉంది. సినిమా రిలీజ్ డేట్ కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండగా, కొంత షూటింగ్ పార్ట్ మిగిలి ఉందట. చిత్ర ప్రమోషన్స్ షురూ చేయలేదు. సాధారణంగా పవన్ సినిమా వస్తే వేరే సినిమాలు దాదాపు రావు. కాని మే 9న వేరే సినిమాలు కూడా అనౌన్స్ చేసుకుంటున్నారు. దాంతో ఈ సారి కూడా హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. హరిహర వీరమల్లు సినిమా ఇప్పటి వరకు 10 సార్లు వాయిదా పడగా ఇప్పుడు 11 వ సారి వాయిదా పడటానికి రెడీగా ఉంది.ఇది కూడా ఒక రికార్డ్ అని అంటున్నారు ఫ్యాన్స్ . పవన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది కాగా, ఈ మూవీ ఇలా వాయిదా పడుతుండడం ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యేలా చేస్తుంది.