హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తాను రచించిన ‘నగ్నవృక్షం’ కవితా సంపుటిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కవి, రచయిత పాశం వెంకట్‌రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌ను కలిసి రెండు పుస్తకాలు అందించారు. ‘ఇది మీది.. ఈ కాపీ పెద్దసారుకు’ అని ఇవ్వగానే. ఓ.. యా.. తప్పకుండా అందిస్తా’ అని కేటీఆర్ తెలిపారు. ప్రకృతిలో వచ్చే మార్పులను, మారుతున్న కాలాలను ప్రతిబింబిస్తూ కాలానుగుణంగా పాశం వెంకట్రెడిడ్డి కవిత్వం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.