Parrot Kallu | చిలుక కొట్టిన కల్లు కోసం ఎగబడుతున్న జనం.. అంత టేస్టీగా ఉంటుందా?
Parrot Kallu | చిలుక కొరికిన జామపండు చాలా రుచిగా ఉంటుందని అంటారు. జామపండే కాదు.. చిలుక కొట్టిన కల్లు కూడా అంతే రుచిగా ఉంటుందంటున్నారు సురప్రియులు. సీజనల్‌గా దొరికే కల్లు మధురంగా ఉంటుంది. ప్రస్తుత సీజన్లో పోద్దాడు కల్లు కోసం చాలామంది వెంపర్లాడుతుంటారు. అయితే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని కల్లు కోసం మూడు రోజుల ముందుగానే ఫోన్‌చేసి ఆర్డర్ ఇస్తున్నారు. ఈ కల్లులో అంత ప్రత్యేకత ఏముంది? అంటారా!
చిలుకలు ఎంగిలి చేసింది కావడంతోనే ఇంత డిమాండ్ వచ్చింది. ప్రకృతి సిద్ధంగా వచ్చే కల్లు మధురంగా ఉంటే.. చిలుక రుచి చూసింది అమృతంలా ఉంటుందట. ఇంకేముంది చిలుక ఎంగిలి కల్లు కోసం కండ్లు కాయలు చేసుకొని ఎదురుచూస్తున్నారు. తాటి చెట్టు గెలకు మెరలు పెట్టాక వచ్చే కల్లును ముందుగా చిలుకలు రుచి చూస్తున్నాయి. ఆ ఎంగిలి కల్లు అద్భుతమైన రుచిని సంతరించుకుంటుందనే నమ్మకం ఏర్పడింది. పైగా ‘చిలుకలు రుచి చూసిన కల్లు తాగితే మంచిది’ అంటూ ప్రచారమూ సాగింది. దీంతో ‘చిలుక ఎంగిలి కల్లు ఉందా?’ అని గీత కార్మికులను అడుగుతున్నారు కల్లు ప్రేమికులు. డిమాండ్‌కు తగ్గట్టుగా రేటూ పెరిగింది. పోద్దాడు కల్లు కూడా ఏడాదిలో ఈ రెండు నెలలే దొరుకుతుంది. దీనికి ‘చిలుక’ చోద్యం కూడా తోడవడంతో ఈ కల్లుకు ఎక్కడలేని గిరాకీ లభిస్తున్నది.
Read More :
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?”
Food for Health | నిండు నూరేళ్లు బతకాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి..”
“ఆకలేస్తోందని అర్ధరాత్రి ఏది పడితే అది తినేస్తున్నారా.. ఈ ఫుడ్ ట్రై చేయండి”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- parrot
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

