Parkinson Disease | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: అల్సర్, గ్యాస్ట్రిక్ సహా జీర్ణక్రియ సంబంధ సమస్యలతో వణుకుడు రోగం 76 శాతం పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. 9,350 మంది పేషెంట్లపై చేసిన పరిశోధనల్లో.. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడినవారు వృద్ధాప్యం వచ్చేసరికి వణుకుడు సమస్యలతో బాధపడినట్టు తమ అధ్యయనంలో తేలిందని అమెరికాలోని బెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. మలబద్ధకం, కడుపు నిండుగా అనిపించటం లాంటి సమస్యలు తలెత్తి.. పార్కిన్సన్కు దారితీస్తాయని వెల్లడించారు. వృద్ధుల్లో పార్కిన్సన్ ఎక్కువగా కనిపించడానికి జీర్ణ సంబంధిత సమస్యలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.