Panneerselvam | బీజేపీ నాయకత్వం టచ్‌లో ఉంది : తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం
బీజేపీతో తెగదెంపులు చేసుకుంటూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ఏఐఏడీఎంకే ప్రకటించగా పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (Panneerselvam) (ఓపీఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై : బీజేపీతో తెగదెంపులు చేసుకుంటూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ఏఐఏడీఎంకే ప్రకటించగా పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (Panneerselvam) (ఓపీఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని ఏఐఏడీంఎకే కాషాయ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఓపీఎస్ స్పందిస్తూ పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఏఐఏడీఎంకే అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని అన్నారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని చెప్పారు.
కాగా బీజేపీతో సంబంధాలను తెంచుకుంటామని, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కూటమితో ముందుకెళతామని ఏఐఏడీఎంకే ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని, తాము తిరిగి ఎన్డీయే గూటికి చేరేది లేదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నామలైని తొలగించాలని తాము బీజేపీ నాయకత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు.
Read More :
Nipah virus: నిపా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు.. శ్యాంపిల్ టెస్ట్‌లో నెగటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

