ధన్‌బాద్ : మన కాలనీలోకి వచ్చే కూరలమ్మలు.. వాళ్ల గంపల్లో ఉండే కూరగాయలను రాగయుక్తంగా పాడి వినిపిస్తూ అమ్ముకునేవారు. ఇప్పుడు కొంచెం ఆధునికత అందుబాటులోకి రావడంతో కూరగాయల వాళ్లు తాము అమ్మే వస్తువుల పేర్లను రికార్డ్ చేసి మైకుల్లో చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూరగాయలు అమ్ముకుంటూ పొట్టపోసుకోవడం మనం చూస్తుంటాం.
అయితే ధన్‌బాద్‌కు చెందిన రితేష్ పాండే కూరలమ్మే తీరు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈయన కాయగూరలు అమ్ముతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈయన డ్యాన్స్‌కు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ పట్టణానికి చెందిన రితేష్ పాండే అనే వ్యక్తి స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, రోజూ ఒకే రకంగా కూరగాయలు అమ్మి బోర్ కొట్టడంతో.. కొత్తగా ఆలోచించాడు. తనదగ్గరున్న టేప్రికార్డర్లో దబాంగ్ సినిమాలోని చుల్బుల్ పాండే గెటప్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్ డ్యాన్స్ చేసిన ‘ఆజావో భాయ్ సబ్జీ లేలో..’ పాటను ప్లే చేసి దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ప్రజలను ఆకర్శిస్తున్నాడు. తలకు పాగా, సన్‌గ్లాసెస్ ధరించి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వచ్చిపోయే వారిని ఆకర్శిస్తున్నాడు.
ఈ వీడియోను ప్రేరణ శర్మ అనే ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెజీస్టార్గా మారిపోయారు.
ये धनबाद के रहने वाले रितेश पांडेय हैं। सब्जी बेचते हैं। लेकिन इनके सब्जी बेचने का तरीका इतना अनोखा है कि इन्होंने सोशल मीडिया पर बवाल मचा दिया है। आपके घर में झोले भर सब्जी हो, इसके बावजूद अगर रितेश के ठेले से गुजरे तो बिना सब्जी खरीदे नहीं लौटेंगे।#Dhanbad #RiteshPandey pic.twitter.com/u3y3WUBkKD
— Prerna Sharma (@Kumariprerana12) March 20, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.