వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని రాములవారి గుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చోరీకి గురైనట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.
విగ్రహాల చోరీ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. విగ్రహాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.