TTD : 28న తిరుమలలో పల్లవోత్సవం
పల్లవోత్సవం | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28న బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు

తిరుమల : మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28న బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
శ్రీవారికి పరమభక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్లాటినం, బంగారు, వజ్రాలు, కెంపులు, పచ్చలు తదితర అమూల్యమైన ఆభరణాలు బహూకరించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదో రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి ఆయన అందించారు.
ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ 5 కేజిల నెయ్యి ఇచ్చే సంప్రదాయం ఆయన ప్రారంభించగా అది నేటికీ కొనసాగుతోంది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన మలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి..
మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది!
‘కల్యాణలక్ష్మి’కి రూ.462.50 కోట్లు
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
జూరాలకు పోటెత్తుతున్న వరద
త్వరలో భారత్‌కు 7.5 మిలియన్ డోసుల మోడెర్నా టీకాలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
Moosarambagh Bridge | మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు.. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహం : వీడియో
ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది : పుట్ట మధుకర్
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

