మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది!
Maira waiter Robo: మైరా..! ఇది హోటల్లో వెయిటర్‌లా పనిచేసే ఒక రోబో పేరు. ఈ రోబో అలాంటి ఇలాంటి రోబో కాదు. ఈ రోబో మీకు హలో చెబుతుంది. మిమ్మల్ని మీ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీతో ముచ్చట్లు పెడుతుంది.

హైదరాబాద్: మైరా..! ఇది హోటల్లో వెయిటర్‌లా పనిచేసే ఒక రోబో పేరు. ఈ రోబో అలాంటి ఇలాంటి రోబో కాదు. ఈ రోబో మీకు హలో చెబుతుంది. మిమ్మల్ని మీ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీతో ముచ్చట్లు పెడుతుంది. మీరు ఏం తింటారో కనుక్కుంటుంది. అంతేకాదు, మీరు ఆడవాళ్లు అయితే ఈ రోబో తన వాయిస్‌ను లేడీ వాయిస్‌లా మార్చుకుంటుంది. ఒకవేళ చిన్నపిల్లలతో మాట్లాడితే ఈ రోబో వాయిస్ కూడా చిన్నపిల్లల వాయిస్‌లా మారిపోతుంది. మరి ఈ రోబోకు మైరా అనే పేరు ఎందుకొచ్చింది..? ఈ రోబోను ఎవరు తయారు చేశారు..? అనేగా మీ సందేహం..? అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పదండి..
మైరా (Maira) అంటే మల్టీ-సెన్సింగ్ ఇంటెలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్ అని అర్థం. ఈ ఇంటరాక్టివ్ రోబోట్‌ను హైదరాబాద్ నగరానికి చెందిన విస్టాన్ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ తయారు చేసింది. అయితే ఈ రోబో జూబ్లీ హిల్స్‌లోని రోబో కిచెన్ లాంటిది కాదు. ఈ రోబో మొత్తం ఆరు వాయిస్‌లలో మాట్లాడగలదు. ఈ రోబో పరిసరాలను చూసేలా, అనుభూతి చెందేలా, చెప్పింది వినగలిగేలా ప్రోగ్రామ్ చేయబడింది. అందుకే ఇది వెంటనే పరిసరాలకు తగినట్లు మారిపోతుంది.
అంతేకాదు, ఈ వెయిటర్ రోబో మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. తల ఆడిస్తుంది. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ టేబుల్ దగ్గరకు వచ్చే వరకు వినోదాన్ని పంచుతుంది. అందుకు తగినట్లు ఈ రోబో ముఖకవలికలను కలిగి ఉంటుంది. ఒక కస్టమర్ ఈ రోబో ముందు నిలబడి హలో అని చెబితే అది ప్రత్యుత్తరం ఇస్తుంది. వారితో సంభాషణ ప్రారంభిస్తుంది. భారతదేశంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మొదటి రోబో ఇదేనని విస్తాన్ నెక్స్ట్‌జెన్ వ్యవస్థాపకుడు రామరాజు సింగం వివరించారు.
రామరాజు సింగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రోబో మైరా తనను ఏ పేరుతో పిలిచినా స్పందించేలా ప్రోగ్రామ్ చేయబడింది. అదేవిధంగా మనం ఇచ్చే ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. సమీప భవిష్యత్తులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో ప్రారంభించబోయే కాన్సెప్ట్ రెస్టారెంట్ల కోసం అవసరమైన మరిన్ని రోబోల తయారీ కోసం కంపెనీ ఆర్డర్లు అందుకుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

