ఎడ్జ్‌బాస్టన్ : ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి 133 రన్స్‌కే ఆలౌట్ అయిన బాబర్ సేన.. ప్రత్యర్థికి భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 453 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాపార్డర్ విఫలమైనా హ్యారీ బ్రూక్ (75)తో పాటు జెమీ స్మిత్ (69), లారెన్స్ (65), ఒలీ రాబిన్సన్ (50), జోఫ్రా ఆర్చర్ (32 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన పాక్.. రాబిన్సన్ మొదటి ఓవర్లోనే సయిమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 52/2 చేసింది.