ENG vs PAK : గ్రూప్ బీ నుంచి సెమీస్ రేసులో ముందున్న ఇంగ్లండ్ (Engalnd) కీలక మ్యాచ్ ఆడుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకను కంగుతినిపించిన హ్యారీ బ్రూక్ సేన మంగళవారం పాకిస్థాన్ సవాల్‌కు సిద్దమైంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఈసారి విజయంపై కన్నేసింది పాక్. స్పిన్ ట్రాక్ మీద తగ్గపోరు ఖాయమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
లీగ్ దశలో చెరొక ఓటమితో గ్రూప్ బీలో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లకు ఇది బిగ్ మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను వణికించిన ఇంగ్లండ్ రెండు పాయింట్లో అగ్రస్థానంలో ఉంది. పాక్‌ను ఓడిస్తే బ్రూక్ సేన సెమీస్‌కు మరింత చేరువవుతుంది. పాక్ పరిస్థితి కూడా అంతే. వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఒక్కబంతీ పడకుండానే రద్దయ్యింది.
Faheem makes way for Shaheen; England unchanged as they look to progress to the semi-finals
Who you got?
LIVE: https://t.co/2mLS1T71kz pic.twitter.com/k3dD5gT47S
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2026
దాంతో.. ఇరుజట్లకు చెరొక పాయింట్ వచ్చింది. ఇంగ్లండ్‌ను ఓడిస్తే పాక్ ఖాతాలో మూడు పాయింట్లు చేరుతాయి. సో.. స్పిన్నర్లు ఉస్మాన్, షాదాబ్, నవాజ్, సయీంలతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయాలని సల్మాన్ అఘా బృందం భావిస్తోంది. కానీ, లంకపై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసిన విల్ జాక్స్ పాక్‌పైన తిప్పేయాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.
పాకిస్థాన్ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
ఇంగ్లండ్ తుది జట్టు : షహిబ్జద ఫర్హాన్, సయీం ఆయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజాం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, నవాజ్, షాహీన్ అఫ్రిది, స్లామన్ మిర్జా, ఉస్మాన్ తారీఖ్.