Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Pa. Ranjith | సరికొత్త కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ 'వేట్టువం' (Vettuvam) విడుదలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Pa. Ranjith | సరికొత్త కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వేట్టువం’ (Vettuvam) విడుదలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రతిష్టాత్మకమైన సంక్రాంతి 2027 (Pongal 2027) కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ అండ్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇది ఒక ఇంటెన్స్ పోస్ట్-అపొకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ (Post-Apocalyptic Sci-fi Actioner) జానర్లో తెరకెక్కుతోంది. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ (Mad Max Fury Road) తరహా వైబ్స్ మరియు ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. భూమి విధ్వంసం, కార్పొరేట్ సిండికేట్లు మరియు ప్రాచీన సంస్కృతికి మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో ఆర్య (Arya) హీరోగా నటిస్తుండగా, శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala), వి.ఆర్. దినేష్ రవి (VR Dinesh Ravi) కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు కలైయరసన్, గురు సోమసుందరం, జాన్ విజయ్, షాబీర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
నీలం ప్రొడక్షన్స్ (Neelam Productions) మరియు లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ (Learn and Teach Production) సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

