Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Ajay Devgn: అజయ్ దేవగన్.. ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ జారీ చేసిన షోకాజ్ నోటీసును అజయ్ దేవగన్ కోర్టులో సవాల్ చేశారు. వాణిజ్య ప్రకటన ద్వారా పాన మసాలాకు చెందిన విమల్ ఇలాచీని ప్రమోట్ చేసిన కేసులో ఎఫ్‌డీఏ అజయ్ దేవగన్‌కు నోటీసులు ఇచ్చింది.
ముంబై: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn).. ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ జారీ చేసిన షోకాజ్ నోటీసును అజయ్ దేవగన్ కోర్టులో సవాల్ చేశారు. వాణిజ్య ప్రకటన ద్వారా పాన మసాలాకు చెందిన విమల్ ఇలాచీని ప్రమోట్ చేసిన కేసులో ఎఫ్‌డీఏ అజయ్ దేవగన్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే దేవగన్ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఎఫ్‌డీఏ కమీషనర్ తుకారం ముండే మీడియాకు తెలిపారు. పాన్ మసాలా వాణిజ్య ప్రకటనల కేసులో షారూక్ ఖాన్, టైగర్ ఫ్రాఫ్లకు కూడా ఎఫ్‌డీఏ నోటీసులు జారీ చేసింది.
అన్ని మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి యాడ్స్‌ను తొలగించాలని ఆ నోటీసుల్లో నటుల్ని కోరినట్లు ప్రభుత్వం చెప్పింది. షోకాజ్ నోటీసులు జారీ చేసి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు నటులు ఎవరూ స్పందించలేదు. ఈ కేసులో అసిస్టెంట్ కమీషనర్ వాదనలు విన్నారని ముండే తెలిపారు. పాన్ మసాలా ఉత్పత్తుల ప్రమోషన్ అంశంలో కుదిరిన అన్ని అగ్రిమెంట్ల వివరాలను వెల్లడించాలని ఎఫ్‌డీఏ తన నోటీసుల్లో కోరింది. విమల్ పాన్ మలాసా అనేది స్మోక్లెస్ టొబాకో ఉత్పత్తి. దీని తయారీ, స్టోరేజీ, ట్రాన్స్‌పోర్టుపై నిషేధం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

