హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అధార్ అప్డేట్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. ఆధార్ అప్డేట్ కాని వారిలో 2.5లక్షలు ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులే ఉన్నారు.
విద్యాశాఖ కొన్ని ఏజెన్సీలకు అప్డేషన్కు అవకాశం కల్పించగా.. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు అనుమతించడంలేదు. ఆయా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరికలు జారీచేసింది.