రాష్ట్రంలో 73.39 లక్షల ఓట్లు ఔట్!
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 లక్షల మంది ఓట్లతోపాటు మరో 20 లక్షల వరకు ఓట్లు తొలగింపునకు గురయ్యే పరిస్థితులున్నాయి.
- అదనంగా మరో 20 లక్షల ఓట్లు గల్లంతయ్యే చాన్స్
- 21.70 శాతం ఫారాలు సేకరించలేకపోయిన ఎన్నికల అధికారులు
- ఇప్పటివరకు 2.64 కోట్ల ఈఎఫ్‌లు డిజిటైజ్
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 లక్షల మంది ఓట్లతోపాటు మరో 20 లక్షల వరకు ఓట్లు తొలగింపునకు గురయ్యే పరిస్థితులున్నాయి. అం టే రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకుపైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం (సీఈవో) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 2,64,87,214 మంది (78.30 శాతం) ఎన్యుమరేషన్ ఫారం (ఈఎఫ్)లను డిజిటలైజ్ చేశారు. అంటే రాష్ట్రంలో ని ప్రతి నలుగురు ఓటర్లలో ముగ్గురి ఈఎఫ్‌లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి.
మిగిలిన 73,39,234 మంది (21.70 శాతం) ఓటర్ల ఈఎఫ్‌లను అధికారులు సేకరించలేకపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో చనిపోయినవారు, అందుబాటులో లేనివారు, ఆచూకీ లేనివారు, శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోయినవారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారితోపాటు ఈఎఫ్‌లను తిరిగి ఇవ్వనివారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈఎఫ్‌లు సమర్పించలేకపోయిన ఓటర్లలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా నమోదయ్యారు. వీరిని ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో ఓటు నమోదు చేసుకుకుని, ఆ హక్కును వదులుకున్నవారిగా అధికారులు భావిస్తున్నారు. వీరంతా తమ సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కును కలిగి ఉం డేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు.
తదుపరి దశపై ఆసక్తి
ఎన్యుమరేషన్ దశ పూర్తయిన నేపథ్యంలో డిజిటలైజ్ అయిన 2.64 కోట్ల ఈఎఫ్‌లు, సేకరించలేకపోయిన 73.39 లక్షల ఈఎఫ్లకు సంబంధించిన తదుపది దశపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటివరకు డిజిటలైజ్ అయిన ఈఎఫ్లన్నీ సక్రమంగా ఉన్నట్టు కాదని, సేకరించలేకపోయిన ఈఎఫ్లన్నీ పోయినట్టు కాదని సీఈవో కార్యాలయ అధికారులు చెప్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న ఏ ఒక్కరినీ తొలగించబోమని, అనామలిస్ జాబితాలో 60 లక్షల పైచిలుకు ఓట్లు కూడా రద్దు కావని తెలిపారు. ఈ నెల 17న పోలింగ్ బూత్‌లవారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఆ జాబితాలో పేర్లు లేనివారందరికీ నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలను, ఆధారాలను సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో పే రు కల్పిస్తామని చెప్పారు. నోటీసులు, అభ్యంతరాలకు నెల రోజుల సమయం ఉంటుందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే తుది ఓటరు జాబితాలపై స్పష్టత వస్తుందని వివరించారు.
తొలగింపునకు గురయ్యే ఓటర్లు
మరణించినవారు 9,22,230
అందుబాటులో లేని/ ఆచూకీ లేనివారు 11,25,546
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు 45,18,961
ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు 6,70,203
ఇతర కారణాలు 1,02,294
మొత్తం 73,39,234
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

