DOST | దోస్త్ సీట్ అలాట్మెంట్.. మొదటి విడుతలో సీటు కోల్పోయిన 19 వేల మంది.. ఎలా అంటే?
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్‌లో (DOST) సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడుత సీట్లను శుక్రవారం కేటాయించారు.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్‌లో (DOST) సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడుత సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ విడుతలో 43,568 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరే కాకుండా మొదటి విడుతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది బెటర్మెంట్ కోసం రెండో విడుత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని సీట్లు దక్కించుకున్నారు. వీరంతా ఈ నెల 18లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. గడువులోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే వచ్చిన సీటును కోల్పోయినట్లే. ఆయా సీట్లను రద్దుచేసి, మరో విడుతకు బదలాయిస్తారు.
చేజార్చుకున్న 19 వేల మంది
దోస్త్ మొదటి విడుతలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని కారణంగా 19 వేల మంది విద్యార్థులు సీట్లను కోల్పోయారు. ఒక్క కారణంతో అంత మంది సీట్లను కోల్పోయారు. దోస్త్ మొదటి విడుత కౌన్సెలింగ్‌లో 60,428 మంది సీట్లను దక్కించుకున్నారు. అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగిసే వరకు 41,285 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేయనివారంతా వచ్చిన సీట్లను కోల్పోయారు. దీంతో కథ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడుతలో సీట్లు దక్కించుకున్న 43 వేల మంది గడువులోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు. లేదంటే వీరు కూడా సీట్లను కోల్పోవాల్సి ఉంటుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

