హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ప్రభుత్వం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించింది. 35 మంది విద్యార్థులను ఎంపికచేసింది. వీరిలో ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు ఆన్లైన్ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి తెలిపారు. 2 నెలల వ్యవధి గల ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు. వీరికి ఆన్లైన్ ద్వారా పలు రకాల స్కిల్స్‌ను నేర్పిస్తామని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా విద్యార్థులు, కంపెనీలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్ఆర్డీసీ) సహకారం తీసుకోనున్నది. ఇరు సంస్థలు త్వరలోనే ఎంఓయూను కుదుర్చుకోనున్నాయి. ఎన్ఆర్డీసీ ఔట్రీచ్ హెచ్ డాక్టర్ బీకే సాహుతో మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి సోమవారం భేటీ అయ్యి పరస్పర సహకారంపై చర్చించారు.