కావలసిన పదార్థాలు
ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), గోధుమపిండి: రెండు కప్పులు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తురుము: కొద్దిగా, అల్లం తురుము: ఒక టీస్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనెవేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి పదినిమిషాలు పక్కనపెట్టాలి. ఒక గిన్నెలో చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, ధనియాలపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని కొద్దిగా ఒత్తి మధ్యలో ఉల్లిగడ్డ మిశ్రమం పెట్టి అంచులు మూసి పరోటాలు చేసుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడయ్యాక రెండు వైపులా నూనెవేస్తూ కాల్చుకుంటే వేడివేడి ఆనియన్ పరోటాలు రెడీ.