వన్ ప్లస్ నుంచి నార్డ్ 6
‘వన్ ప్లస్ నార్డ్ సిరీస్' స్మార్ట్ఫోన్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ అనుభవాన్ని అందిస్తాయి. అందుకే, మిడిల్‌క్లాస్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. పాత మోడల్స్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతూ, మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిస్తూ.. ‘నార్డ్ 6’ను తీసుకొచ్చారు.
‘వన్ ప్లస్ నార్డ్ సిరీస్’ స్మార్ట్ఫోన్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ అనుభవాన్ని అందిస్తాయి. అందుకే, మిడిల్‌క్లాస్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. పాత మోడల్స్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతూ, మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిస్తూ.. ‘నార్డ్ 6’ను తీసుకొచ్చారు. భారతీయ మార్కెట్లోకి తాజాగా విడుదలైన ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అంటేనే బ్యాటరీకి పెద్దపీట వేస్తారు. ఇందులోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. 9,000 ఎంచేహెచ్ భారీ బ్యాటరీని పొందుపరిచారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే.. 6.78-అంగుళాల 1.5కె AMOLED స్క్రీన్ ఉంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్, అడ్రెనో 835 జీపీయూతో గేమింగ్‌కు చాలా స్మూత్‌గా ఉంటుంది.
8జీబీ/12 జీబీ ర్యామ్ ఉండటం వల్ల.. ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. యువతతోపాటు ఫొటోగ్రఫీని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. 256 జీబీ స్టోరేజ్ ఉండటం వల్ల మెమొరీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కావాల్సినన్ని ఫొటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. రక్షణ విషయంలోనూ వన్ ప్లస్ ఎక్కడా రాజీపడలేదు. ఐపీ 69కె రేటింగ్ ఉండటం వల్ల నీరు, ధూళి నుంచి అత్యున్నత స్థాయి రక్షణ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 (ఆక్సీజన్ ఓఎస్ 16)తో పనిచేసే ఈ ఫోన్‌కు నాలుగేళ్ల మేజర్ అప్డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తున్నది. తాజాగా విడుదలైన ఈ వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్.. రూ. 39,000 నుంచి రూ.42,000 దాకా ధర పలుకుతున్నది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

