వ్యక్తి అదృశ్యం

సికింద్రాబాద్, జనవరి 5: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిఖ్ విలేజ్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన దుబ్బాక అనిల్ సమీపంలోని మస్తాన్ చౌరస్తాలో దినపత్రికలు విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నా డు. దీంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్ కు విద్యార్థులను ఆటో తీసుకెళ్తుంటాడు. అనిల్‌కు అనితతో 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేండ్ల కూతురు సాత్విక ఉంది.
ఈనెల 2వ తేదీన ఇంటి కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్‌ను నిలిపివేశారు. అదే విధంగా ఇంట్లో నిత్యావసర సరుకులు సైతం లేకపోవడంతో రాత్రి 9గంటలకు ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో యథావిధిగా 3వ తేదీన దినపత్రికల విక్రయాల కోసం ఉదయం 5గంటలకే దుకాణానికి వెళ్లా డు. అనంతరం స్కూల్ విద్యార్థులను ఆటోలో పాఠశాలలకు తీసుకెళ్లి దుకాణానికి వచ్చాడు.
సెల్‌ఫోన్, ఆటో తాళం చెవులను దుకాణం లో ఇచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బయటకువెళ్లిపోయాడు.సాయం త్రం అయినా అనిల్ తిరిగిరాకపోవడంతో తెలిసిన వా రితో పాటు బంధువులను, చుట్టుపక్కల వారిని ఆరా తీసిన ఫలితం లేకపోవడం తో 4వ తేదీన కార్ఖానా పోలీస్ స్టేషన్లో అనిల్ భార్య అనిత ఫిర్యాదు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కడికో వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే కార్ఖానా పోలీస్ స్టేషన్లో గానీ కార్ఖానా సీఐ 9490616457, 9490616309 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- karkhana
- Karkhana police
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

